Header Banner

ఇస్రో స్పేస్ మిషన్‌కు శ్రీకారం! మరో అంతర్జాతీయ ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్‌డౌన్.. రాకెట్ పరికరాల రవాణా పూర్తీ!

  Sat Apr 19, 2025 08:01        Others

షార్‌కు చేరిన రాకెట్‌ పరికరాలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి మే 22న జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రాకెట్‌ ద్వారా అమెరికాకు చెందిన నిషార్‌ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లో రెండో ప్రయోగ వేదిక వద్దనున్న వెహికల్‌ అసెంబ్లీ బిల్డింగ్‌ (వ్యాబ్‌లో)లో రాకెట్‌ అనుసంధాన పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో పాటు పీఎస్ఎల్వీ-సీ61, ఎల్‌వీఎం-3-జీ1, ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ల అనుసంధాన పనులు కూడా జరుగుతున్నాయి. జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 అనుసంధానానికి సంబంధించిన రాకెట్‌ పరికరాలు కేరళలోని తిరువనంతపురం నుంచి భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక వాహనాల్లో శుక్రవారం షార్‌కు తీసుకొచ్చారు. ప్రయోగించే విదేశీ ఉపగ్రహాన్ని కూడా నెలాఖరులో షార్‌కు తీసుకురానున్నారు.
రెండేళ్లలో కులశేఖరపట్టణం నుంచి ప్రయోగాలు: నారాయణన్‌
రాబోయే రెండేళ్లలో కులశేఖరపట్టణం నుంచి రాకెట్‌ ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు. తమిళనాడులోని నాగర్‌కోవిల్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కన్నియాకుమారిలోని సూర్యాస్తమయ ప్రాంతం వద్ద స్పేస్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. కులశేఖరపట్టణంలో 95 శాతం భూమి స్వాధీనం చేసుకున్నామని, రెండేళ్లలోపు ఇక్కడి నుంచి రాకెట్‌ ప్రయోగం చేపడతామని తెలిపారు. 2025లో ఇస్రో అనేక విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శ్రీహరికోటలో 42 నెలల్లో మూడవ ల్యాండ్‌ పాడ్‌ ఏర్పాటు చేయనున్నామని, అందుకు కేంద్రం రూ.4,000 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ త్వరలోనే భారత్‌కు రానున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండిబీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ISRO #SpaceMission #NISAR #RocketLaunch #Sriharikota #SatelliteLaunch #IndiaInSpace